శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 మార్చి 2018 (12:52 IST)

రాజీనామాలకు సిద్ధంగా ఉండండి... బీజేపీ హైకమాండ్ ఆదేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ మంత్రులకు ఆ పార్టీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. బీజేపీతో పొత్తును ఉపసంహరించుకుంటామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటిస్తే... వెంటనే రాజీనామా చేయాలని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ మంత్రులకు ఆ పార్టీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. బీజేపీతో పొత్తును ఉపసంహరించుకుంటామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటిస్తే... వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ మంత్రులకు హైకమాండ్ ఆదేశాలు జారీచేసింది. 
 
ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస రావుకు ఢిల్లీ నుంచి ఆదేశాలు అందాయి. దీంతో వెంటనే అమరావతిలో బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు. 
 
అలాగే, ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు, వైజాగ్ ఎంపీ కె.హరిబాబుతో కూడా వారు ఫోనులో మాట్లాడి, ఢిల్లీ హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాలపై ఆరా తీశారు. ఆయన కూడా రాజీనామాలకు సిద్ధంగా ఉండాలంటూ ఆదేశించారు. 
 
కాగా, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కామినేని శ్రీనివాస్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రిగాను, పైడికొండల మాణిక్యాల రావు దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రిగా ఉన్నారు.