శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr

ఆంధ్రప్రదేశ్ : పదవులకు రాజీనామాలు చేసిన బీజేపీ మంత్రులు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన బీజేపీ ఎమ్మెల్యేలు తమతమ మంత్రిపదవులకు రాజీనామా చేశారు. ఆ వెంటనే తమ గుర్తింపు కార్డులతో పాటు.. ప్రభుత్వ వాహనాల

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన బీజేపీ ఎమ్మెల్యేలు తమతమ మంత్రిపదవులకు రాజీనామా చేశారు. ఆ వెంటనే తమ గుర్తింపు కార్డులతో పాటు.. ప్రభుత్వ వాహనాలను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. 
 
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఇప్పటివరకూ భాగంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు తమ అధికారిక వాహనాలను, ఐడీ కార్డులను వెనక్కు ఇచ్చేశారు. 
 
బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి బయటకు రావాలని బీజేపీ నిర్ణయించుకుంది. 
 
ఈ మేరకు బీజేపీ హైకామండ్ నుంచి వారికి స్పష్టమైన ఆదేశాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉదయం తమ అధికారిక వాహనం, మంత్రులుగా తెలిపే గుర్తింపు కార్డులను వారు ప్రభుత్వానికి అప్పగించారు.