1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Devotees Spot Leopard in Tirumala, TTD Issues Caution

తిరుమల శిలాతోరణం వద్ద చిరుతపులి కలకలం : తితిదే అలెర్ట్

leopard - bear
తిరుమల తిరుపతిలో మరోమారు చిరుతపులి కలకలం రేపింది. తిరుమల శిలాతోరణం సర్కిల్‌లోని ఓ కొండపై గురువారం సాయంత్రం చిరుత కూర్చుని ఉండటాన్ని కొందరు స్థానికులు గుర్తించారు. తమ సెల్‌ఫోన్‌లో వీడియో తీసుకుని తితిదే విజిలెన్స్‌, ఫారెస్ట్‌ అధికారులకు సమాచారమిచ్చారు. ఈ క్రమంలో వాహనదారులను, భక్తులను అధికారులు అప్రమత్తం చేశారు. 
 
కాగా, గతంలో పలుమార్లు చిరుతపులి తిరుమల కొండల్లో కనిపించి కలకలం రేపిన విషయం తెల్సిందే. వైకాపా ప్రభుత్వంలో ఓ చిరుత పులి ఓ బాలికపై దాడి చేసి చంపేసిన విషయం తెల్సిందే. ఆ సమయంలో తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు రక్షణగా వైకాపా పాకలకులకు నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి బొమ్మలతో కూడిన చేతికర్రలను కూడా ఇచ్చింది. ఈ చర్య విమర్శలకు దారితీసింది. ఆ తర్వాత కొంతకాలం చిరుతపులి హడావుడి కనిపించలేదు. ఇపుడు మళ్లీ కనిపించడంతో కలకలం చెలరేగింది. దీంతో కానినడకన తిరుమల వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా నడిచి వెళ్లరాదని, సమూహాలుగా వెళ్ళాలని సూచన చేసింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు