తిరుమలలో మరోసారి చిరుత సంచారం భక్తుల్లో కలకలం రేపుతోంది. తిరుమల శిలాతోరణం వద్ద చిరుత పులి సంచారాన్ని భక్తులు గుర్తించారు. వెంటనే భక్తులు టీటీడీ అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులను అప్రమత్తం చేశారు. మరోవైపు ఫిబ్రవరిలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే పర్వదినాలు, ఇతర విశేష ఉత్సవాలకు సంబంధించిన వివరాలను టీటీడీ అధికారులు...