గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 జనవరి 2025 (14:42 IST)

తిరుపతిలో సెటిల్ అవుతా, గోవిందా... గోవిందా నామస్మరణతో నిద్రలేస్తా: జాన్వీ కపూర్

jhanvi kapoor
భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి శ్రీవారి సన్నిధి తిరుమల తిరుపతిలో హాయిగా జీవించాలని హీరోయిన్ జాన్వీ కపూర్ తన మనసులోని మాటను వెల్లడించారు. దివంగత నటి శ్రీదేవి కుమార్తెగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ తన టాలెంట్‌తో అగ్రనటిగా ఎదిగింది. పాన్ ఇండియా మూవీలు చేస్తూ ఎంతో బిజీ లైఫ్‌ను గడుపుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషా చిత్రాల్లో నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో దేవరన నటించిన జాన్వీ.. ఇపుడు రామ్ చరణ్‌తో ఆర్సీ 16లో హీరోయిన్‌గా నటిస్తుంది. 
 
ఈ క్రమంలో బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ షోలో పాల్గొని పిచ్చాపాటిగా మాట్లాడారు. తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనేది తన కోరిక అని చెప్పింది. భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి తిరుమలలో హాయిగా జీవించాలని ఉందని చెప్పారు. ప్రతి రోజూ అరటి ఆకులో అన్నం తింటూ గోవిందా గోవిందా అని స్మరించుకోవాలని ఉందని తెలిపారు. పనిలోపనిగా దర్శకుడు మణిరత్నం సినిమాల్లోని సంగీతాన్ని వింటూ కూర్చోవాలని ఉందని తెలిపారు.