శోభనం రాత్రి తెల్లటి దుప్పటిపై రక్తపు మరకలు లేవనీ... కోడలి కన్యత్వంపై సందేహం... ఎక్కడ?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో ఓ దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. శోభనం రాత్రి తెల్లటి దుప్పటిపై రక్తపు మరకలు లేవని కోడలి కన్యత్వంపై అత్తమామలు సందేహం వ్యక్తం చేస్తూ, పలు ప్రశ్నలు సంధించారు. కోడలు చెప్పిన సమాధానానికి అత్తకు అనుమానం తీరలేదు. దీంతో కోడలి పక్కింటి అమ్మాయికి ఫోన్ చేసి వాకబు చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
గత నెల 12వ తేదీన భోపాల్‌కు చెందిన ఒక యువకుడు ఇండోర్‌కు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి తంతు ముగిన తర్వాత శోభనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, శోభనం రాత్రి బెడ్ మంచంపై పరిచిన తెల్లటి దుప్పటిపై ఎర్రటి రక్తపు మరకలు లేవని కోడలి కన్యత్వాన్ని అత్తమామలు శంకించారు. బాధితురాలి భర్త కూడా అమ్మనాన్నలకు వంతపాడాడు. అంతేనా, వధువు పొరుగింటి యువతికి ఫోన్ చేసి.. దుప్పటిపై రక్తపు మరకలు ఎదుకు లేవని ప్రశ్నించింది.