శుక్రవారం, 7 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 జనవరి 2025 (11:14 IST)

నరేష్‌లో 10 మందికి ఉండే ఎనర్జీ ఉంది.. రాత్రి అయితే తట్టుకోలేకపోతున్నా... : నటి పవిత్ర లోకేశ్ (Video)

pavitra
తన భర్త, సినీ నటుడు సీనియర్ నరేష్ గురించి ఆయన భార్య పవిత్ర లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియో అయితే ట్రెండింగ్‌లో ఉంది. నరేష్‌లో పది మందికి ఉండే ఎనర్జీ ఉందన్నారు. రాత్రి అయితే, తాను తట్టుకోలేక, ఇక తన వల్ల కాదని చెప్పి అలసిపోతున్నట్టు కామెంట్స్ చేశారు.
 
నరేష్ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విలేకరులల సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఒక పది మందికి ఉండాల్సిన ఎనర్జీ నరేష్‌కు ఒక్కడికే ఉందన్నారు. ఆయన ఎనర్జీని మనమంతా తట్టుకోలేమన్నారు. నైట్ అయితే అలసిపోతాను. ఇక నా పని అయిపోయింది.. ఆయన్నీ మీరే చూసుకోవాలి అని తన స్టాఫ్‌కు అప్పచెబుతాను. ఆయనకి అంత ఎనర్జీ ఉంటుంది. ఏ పని మొదలుపెట్టిన అంత సిస్టమాటిక్‌గా, డిసిప్లిన్గా చేస్తారని చెప్పారు. 
 
తన భర్త గురించి నరేష్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె వ్యాఖ్యలను నెటిజన్స్ ట్రోల్స్ చేస్తూ, వివిధ రకాలైన కామెంట్స్ చేస్తున్నారు.