1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Distribution of essential supplies for home guards

హోమ్ గార్డులకు నిత్యవసర సరుకుల పంపిణీ

essential supplies
బేరకా మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు కిరణ్ పాల్ ఆర్ధిక సహకారంతో హోం గార్డులకు నిత్యావసర సరుకులను శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాథ్ బాబు పంపిణీ చేశారు.

290 మంది హోమ్ గార్డ్స్ కు 11 రకాల నిత్యావసరాల సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా దాత కిరణ్ పాల్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి కట్టడలో అహర్నిశలు శ్రమిస్తున్న పోలీస్ వారికి తమ వంతు సహకారం వారికి అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ వారి సేవలు గుర్తించి అందించిన సహాయానికి కిరణ్ పౌల్ కు పోలీస్ శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సత్తిబాబు, ధర్మేంద్ర, ట్రైనీ డీఎస్పీ శ్రావణి, చంద్రశేఖర్, డిసిఆర్బి సిఐ శ్రీనివాసరావు, పి సి ఆర్ సి ఐ అంకబాబు, ఆర్ఐ చంద్రశేఖర్, బెరాకా మినిస్ట్రీస్ వలంటీర్ లు, సిబ్బంది పాల్గొన్నారు.
తర్వాతి కథనం
ఎల్‌జి పాలిమర్స్ బాధితుల పరామర్శించిన టీడీపీ త్రిసభ్య కమిటీ