1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Vijayawada Hotels ready for Foreigners

విదేశాల నుంచి వచ్చేవారికి విజయవాడ హోటల్స్ సిద్ధం

Vijayawada
విదేశాల్లో ఉన్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల్లో తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. 64 విమానాల్లో వారిని స్వదేశానికి రప్పిస్తోంది.

ఈ క్రమంలో, విదేశాల్లో ఉన్న తెలుగు వారు సోమవారం నాటికి ప్రత్యేక విమానాల్లో ముంబయి చేరుకోనున్నారు. వారిని ముంబయి నుంచి హైదరాబాదుకు, గన్నవరం ఎయిర్ పోర్టుకు తరలించనున్నారు.

విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల పాటు పెయిడ్ క్వారంటైన్ కు తరలిస్తారు. విదేశాల నుంచి వచ్చేవారి కోసం ఏపీ ప్రభుత్వం విజయవాడలో హోటళ్లు, లాడ్జీల్లో 1000 గదులు సిద్ధం చేసింది.

14 రోజుల తర్వాత నెగెటివ్ వస్తే ఇళ్లకు పంపిస్తారు. అవసరాన్ని బట్టి 28 రోజుల వరకు క్వారంటైన్ పెంచే అవకాశం ఉంది. వృద్ధులు, పిల్లలు, గర్భిణులు హోం క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచించారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
ఎల్‌జి పాలిమర్స్ బాధితుల పరామర్శించిన టీడీపీ త్రిసభ్య కమిటీ