1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Drunk man travel on RTC bus stepney tyre

బస్సు స్టెప్నీ టైరుపై పడుకుని 20 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తాగుబోతు!! (Video)

drunk man - bus stepney
ఓ తాగుబోతు పెను ప్రాణాపాయం నుంచి తప్పిచుకున్నాడు. బస్సు వెనుక కింద భాగాన ఉన్న స్టెప్నీ టైరుపై పడుకొని గుర్తు తెలియని ఓ వ్యక్తి 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం అందిరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు కొత్త చెరువు నుంచి హిందూపురానికి ఆర్టీసీ బస్సు ఒకటి బయలుదేరింది. పెనుకొండ సమీపంలోని రాంపురం వద్ద బస్సు వెళుతుండగా బస్సు కింది భాగంలో కాళ్లు వేలాడుతుండటాన్ని ద్విచక్రవాహనంపై వెళుతున్న వాహనదారులు గమనించి డ్రైవర్‌కు చెప్పారు. 
 
ఆ వెంటనే బస్సును పక్కన ఆపిన డ్రైవర్ చిరంజీవి రెడ్డి స్టెప్నీ భాగంలో చూడగా, మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి స్టెప్నీ టైర్‌మీద నుంచి కిందకు రావడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అతని వివరాలను ఆరా తీయగా చెప్పలేదు. దీంతో దండించి పంపించి వేశారు. అయితే, ఈ ఘటనలో అతనికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో డ్రైవర్, కండక్టర్‌, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 

 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
టోర్నడోల బీభత్సం - పెనుగాలులకు ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు (Video)