సోమవారం, 10 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 మార్చి 2025 (13:11 IST)

రోడ్డు పక్కనే కారు ఆపాడు... ఆ పక్కనే కానిచ్చేశాడు (Video)

urinate
మహారాష్ట్రలోని పూణె నగరంలో ఓ యువకుడు పాడుపనికి పాల్పడ్డాడు. డబ్బుందున్న మదంతో లగ్జరీ కారులో విహరిస్తూ రోడ్డు పక్కనే మూత్రవిసర్జన చేశాడు. అదీకూడా తన కారును రోడ్డు మధ్యలోనే ఆపేసి ఈ పాడుపనికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. 
 
వీడియోలో ఉన్న దృశ్యాల మేరకు పూణెలోని ఓ యువకుడు జంక్షన్ వద్ద రోడ్డుమీదే కారు నిలిపి అక్కడే మూత్రవిసర్జన చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆ నిందితుడుని, అతని స్నేహితుడుని గుర్తించి అరెస్టు చేశారు. ఈ దృశ్యాలను మరో వ్యక్తి తమ మొబైల్ ఫోనులో రికార్డు చేశాడు. ఆ సమయంలో కూడా ఆ యువకుడు మరింతగా రెచ్చిపోయి ప్రవర్తించాడు.