శనివారం, 15 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 మార్చి 2025 (19:25 IST)

తిరుమలలో మందుబాబు హల్ చల్.. మహిళతో వాగ్వాదం.. కొండపైనే మద్యం తాగాడా? (video)

Drunk man creates ruckus in Tirumala
Drunk man creates ruckus in Tirumala
తిరుమలలో మద్యంపై నిషేధం ఉంది. తిరుపతిలో అలిపిరి వద్ద  కూడా కొండపైకి వెళ్లేవాళ్లను చెక్ చేస్తుంటారు. అయితే తిరుమలలో ఓ మందుబాబు హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో తిరుమల మాఢవీధుల్లో హంగామా సృష్టించాడు. అంతేకాదు ఎవరికి ఎంత మందు కావాలంటే అంత మందు అమ్ముతా అంటున్నాడు. ఓ మహిళతో వాగ్వాదం పెట్టుకున్నాడు. 
 
ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అతడిని అక్కడ్నించి బలవంతంగా తరలించారు. అతడు మద్యం తాగి కొండపైకి వచ్చాడా.. లేక కొండపైనే మద్యం తాగాడా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో తిరుమల లాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ ఏకిపారేస్తున్నారు.