1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. galla jaydev election campaign in Guntur Tenali

వైకాపా అరాచక పాలనకు చరమగీతం పాడాలి : గల్లా జయదేవ్

Galla Jaydev
వైకాపా అరాచక పాలనకు మున్సిపల్‌ ఎన్నికల నుంచి చరమగీతం పాడాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుంటూరు నగరంతో పాటు తెనాలి మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థుల తరపున మంగళవారం జయదేవ్‌ ప్రచారం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా దౌర్జన్యాలను ప్రజలంతా చూశారని, వాటిని అడ్డుకోవాలంటే మున్సిపల్‌ ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలని కోరారు. 
 
వైకాపా దౌర్జన్యాలను అడ్డుకునే శక్తి తెదేపాకు మాత్రమే ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నింటినీ వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు. 
 
తెనాలిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇస్త్రీ బండి వద్ద కాసేపు దుస్తులు ఇస్త్రీ చేశారు. వెల్డింగ్‌ షాపు వద్ద కార్మికులతో మాట్లాడారు. జయదేవ్‌తో పాటు గుంటూరు తూర్పు ఇన్‌ఛార్జి నసీర్‌ అహ్మద్‌, తెనాలి ఇన్‌ఛార్జి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తదితరులు ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు.
తర్వాతి కథనం
వైకాపాకు ఓటు వేస్తే ఐదు రెట్ల చార్జీలు భరించాల్సిందే : కేశినేని నాని