శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 మార్చి 2021 (14:54 IST)

వైకాపాకు ఓటు వేస్తే ఐదు రెట్ల చార్జీలు భరించాల్సిందే : కేశినేని నాని

వైసీపీ ప్రజాదరణ కోల్పోయి, అధికార దుర్వినియోగంతో పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకొని అరాచకాలు సృష్టించి  విజయవాడ మునిసిపల్ ఎన్నికలు గెలవాలని చూస్తుంది. వైసీపీ మద్యం పంచడం, వ్యాపారస్తుల దగ్గర డబ్బులు బలవంతంగా వసూళ్లు చేసి ఓటర్లకు పంచాలని చూస్తున్నారు.
 
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ లో 50 కార్పొరేటర్ సీట్లు గెలవబోతున్నాం. 21 నెలల వైసీపీ పాలనలో విజయవాడ అభివృద్ధి శూన్యం. నిత్యావసర వస్తువుల ధరలు 3 రేట్లు పెంచి ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పేదలకు విద్యుత్ చార్జీలు పెంచి సంక్షేమ పథకాలు తొలిగిస్తున్నారు. సంక్షేమ పథకాలు రాష్ట్రంలో 30 శాతం ప్రజలకు మాత్రమే అందిస్తున్నారు.
 
మున్సిపల్ కార్పొరేషన్లలో ఇంటి పన్నులు, నీటి పన్నులు, డ్రైనేజీ పన్నులు ఏప్రిల్ 1 నుండి ఐదు రెట్లు పెంచుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. వైసిపి పాలనలో ప్రతి కుటుంబం ఆర్థికంగా చితికి పోతుంది. 21 నెలల వైసిపి పాలన లో విజయవాడ నగరంలో రోడ్డుపై ఒక గుంత కూడా పూడ్చలేకపోయింది.
 
చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ తరఫున ఈ విజయవాడ నగర అభివృద్ధి నా బాధ్యత, కేంద్రం నుండి గతంలో కన్నా రెట్టింపు నిధులు తీసుకువచ్చి ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన సీపీఐకి అధికారం ఇచ్చినట్లయితే ప్రజలపై ఒక్క రూపాయి భారం కూడా పడకుండా నగరాన్ని అభివృద్ధి చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని నాని హామీ ఇచ్చారు.