1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Godavari Flow Rises at Dowleswaram, First Flood Warning Likely Tonight

శబరి నది, దౌళేశ్వరం వద్ద పెరుగుతున్న నీటి మట్టం- రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక

Godavari
Godavari
దౌళేశ్వరం వద్ద గోదావరి నది నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో రెండూ 5 లక్షల క్యూసెక్కులకు చేరుకున్నాయి. ఈ రాత్రికి దౌళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉంది. పెరుగుతున్న నీటి మట్టాలను దృష్టిలో ఉంచుకుని, విపత్తు నిర్వహణ సంస్థ అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు పోలవరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, కోనసీమ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. లంక గ్రామాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
 
మరోవైపు రాబోయే 12 గంటల్లో శబరి నదిలో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున పోలవరం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం ప్రవాహం 2.8 లక్షల నుండి 3 లక్షల క్యూసెక్కుల మధ్య ఉండగా, ఇది 5.2 లక్షల నుండి 5.5 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉంది. చింతూరు మండలంలో, ఏజే కోడూరు పరిధిలోని నివాస ప్రాంతాలకు చెందిన 47 కుటుంబాలను, చింతూరు గ్రామంలో శబరి నది ఒడ్డున నివసిస్తున్న 21 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి - పార్లమెంటులో చట్టం.. ఆ వ్యాజ్యాలు నిరర్ధకం : ఏపీ హైకోర్టు