1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Hyderabad shocker: Three family members found dead in flat

హైదరాబాద్‌లో విషాదం .. కుమారుడితో కలిసి తల్లిదండ్రుల ఆత్మహత్య

suicide
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో విషాదం చోటుచేసుకుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అపార్టుమెంట్‌లో కుమారుడితో కలిసి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ కె.సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌలిదొడ్డిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఏడాదిగా బత్తుల మారెడ్డి (65), ఆయన భార్య భారతి (60), కుమారుడు నిశాంత్‌రెడ్డి (38)తో నివాసముంటున్నారు. 
 
ఆదివారం ఉదయం 8.40 గంటల సమయంలో ఫ్లాట్‌లో ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కుటుంబంలో నెలకొన్న సమస్యలు, అనారోగ్య కారణాలతోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కచ్చితమైన కారణాలు, పరిస్థితులపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
తాగునీటితో ఫ్లోర్‌క్లీనింగ్ చేశారని.. రూ.20 వేల అపరాధం