1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. International Smuggler Raghunatha Reddy Arrest

అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ అరెస్టు

International Smuggler Raghunatha Reddy
అంతర్జాతీయ ఎర్ర చందన్ స్మగ్లర్‌న ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ స్మగ్లర్ పేరు రామనాథ రెడ్డి. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. కుప్పం - కృష్ణగిరి హైవేలో పెద్ద మొత్తంలో ఎర్రచందనాన్ని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.
 
కొంతకాలంగా రామనాథ రెడ్డిపై పోలీసులు నజర్‌ పెట్టారు. అతని అనుచరులపై సైతం నిఘాపెట్టారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తున్నారనే పక్కా సమాచారంతో జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహించారు. 
 
ఆ సమయంలో ఓ వాహనంలో సుమారు 50 లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకుని, రామనాథ రెడ్డితోపాటు అతని ముగ్గురు అనుచరులను అరెస్టు చేశారు. ఎర్ర చందనం దుంగలతో పాటు వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. 
తర్వాతి కథనం
జగనన్న ఇళ్ల పథకంపై హైకోర్టు స్టే.. తీర్పు హర్షణీయమన్న రామకృష్ణ