1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Sacrifice Star Sunishit Arrest at Telangana

శాక్రిఫైజ్ స్టార్ సునిషిత్ ఆటకట్టించిన పోలీసులు

Sacrifice Star Sunishit
టాలీవుడ్ సెలెబ్రిటీలపై ఇష్టానుసారంగా నోరు పారేసుకుని పాపులర్ అయి శాక్రిఫైజ్ స్టార్‌గా గుర్తింపు పొందిన సునిశిత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీసులు సునిశిత్‌‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. నకిలీ వీడియోలను సృష్టించి ఓ పోలీస్ అధికారిపై తప్పుడు ఆరోపణలు చేసిన కేసులో అతడిని అరెస్టు చేశారు. 
 
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాకు చెందిన సునిశిత్‌ ఓ కాలేజీ‌లో లెక్చరర్‌గా పని చేశాడు. అయితే కాలేజీ‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్న సమయంలో ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ నేపథ్యంలోనే గతంలో జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత విడుదలైన సునిశిత్‌… టాలీవుడ్ హీరోలపై సెటైర్లు వేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. 
 
అంతేకాదు సినీ ప్రముఖులపై తప్పుడు ప్రచారం చేస్తూ ఓ కేసులో కూడా బుక్కయ్యాడు. ఇక తాజాగా మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ఓ పోలీస్ అధికారిపై తప్పుడు వీడియో పోస్ట్ చేశాడు. ఈ అధికారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కీసర పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 
తర్వాతి కథనం
పవన్ కళ్యాణ్ శ్రమదానంపై టెన్షన్.. టెన్షన్... నేతల హౌస్ అరెస్టులు