శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 అక్టోబరు 2021 (11:03 IST)

పవన్ కళ్యాణ్ శ్రమదానంపై టెన్షన్.. టెన్షన్... నేతల హౌస్ అరెస్టులు

గాంధీ జయంతి సందర్భంగా ఏపీలో శ్రమదానం చేసేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సిద్ధమైయ్యారు. దీంతో రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. శనివారం తూర్పుగోదావరి జిల్లా, అనంతపురం జిల్లాల్లో పవన్‌కల్యాణ్‌ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. 
 
రాజమహేంద్రవరంలో శ్రమదానంలో పాల్గొనడం చట్టవ్యతిరేకమంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ధవళేశ్వరం ఆనకట్ట రహదారిని మూసివేశారు. రాజమహేంద్రవరానికి వచ్చే అన్ని మార్గాల్లో పోలీసుల మోహరించారు. 
 
రాజమహేంద్రవరానికి వచ్చే మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. వాహనాలు తనిఖీ చేసి పంపుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ రహదారికి శ్రమదానం చేయాలని పవన్ నిర్ణయించగా భద్రతా కారణాలతో జలవనరుల శాఖ అధికారులు అనుమతి నిరాకరించారు.
 
రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై ఆక్టోబర్ 2న శ్రమదానం చేయాలని నిర్ణయించారు. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరంలోని ఆర్థర్ కాటన్ బ్యారేజీపై, అనంతపురం జిల్లా కొత్తచెరువలో పవన్ శ్రమదానం చేస్తానని ప్రకటించారు. ఇందుకు సంబందించిన ఏర్పాట్లును జనసైనికులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 
 
అయితే, కాటన్ బ్యారేజీ వద్ద పవన్ కార్యక్రమానికి ఇరిగేషన్ శాఖ అధికారులు అనుమతి ఇవ్వలేదు. బ్యారేజీపై మరమ్మతులు చేయడానికి వీల్లేదని.. గుంతలు పూడిస్తే బ్యారేజీ నష్టమని తెలిపారు. అంతేకాకుండా కాటన్ బ్యారేజీ ఆర్ అండ్ బీ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు.
 
మరోవైపు జనసేన పార్టీ నేతలు మాత్రం ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిననా తాము మాత్రం బ్యారేజీపై శ్రమదానం చేసి తీరుతామని తేల్చి చెబుతున్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న తమను అడ్డుకోవాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని ఆరోపిస్తున్నారు.