మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 అక్టోబరు 2021 (08:35 IST)

ఫోనులో టార్చర్ - భార్య కారుకు నిప్పు పెట్టిన ఐటీ ఉద్యోగి

కట్టుకున్న భార్య ఫోన్ చేసి టార్చర్ చేయడాన్ని తట్టుకోలేక పోయాడు. దీంతో భార్య కారుకు నిప్పుపెట్టాడు. ఈ మంటలు వ్యాపించి పక్కనే ఉన్న మరో నాలుగు బైకులకు నిప్పు అంటుకుని కాలిబూడిదయ్యాయి. ఈ సంఘటన చెన్నై నగర శివారు ప్రాంత నెర్కుండ్రంలో జరిగింది. దీంతో ఐటీ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నై నెర్కుండ్రం షణ్ముఖనగర్‌ సత్యం వీధిలో గత నెల 25న ఒక కారు, నాలుగు బైకులు నిప్పు అంటుకుని దగ్ధమయ్యాయి. దీనిపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో స్థానికంగా నివాసం ఉండే సతీష్‌ (26)ను పోలీసులు అరెస్టు చేశారు.
 
పోలీసులు వివరణలో చెన్నై అంబత్తూరు ఐటీ కంపెనీలో పనిచేస్తున్న సతీష్‌ 2019 నుంచి భార్య వెండామనితో విడిపోయాడు. అప్పటినుంచి తల్లి ఇంటిలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో భార్య అతనికి తరచూ ఫోన్‌ చేసి వేధింపులకు గురిచేస్తూ ఉండడంతో విరక్తి చెందాడు. 
 
భార్యపై ప్రతీకారం తీర్చుకునేందుకు గాను ఆమె కారుకు నిప్పు పెట్టాడు. ఈ మంటలు విస్తరించి సమీపంలోని కారు, నాలుగు బైకులు దగ్ధం చేశాయి. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ విషయం స్థానికంగా సంచలనం కలిగించింది.