గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (15:42 IST)

టీ20 ధనాధన్ క్రికెట్.. ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు ఎంట్రీ

టీ20 ధనాధన్ క్రికెట్ ఫార్మట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఇక మరింత కలర్‌ఫుల్‌గా మారబోతోంది. ఐపీఎల్ మెగా టోర్నమెంట్‌లో మ్యాచ్‌ల సంఖ్య పెరగనుంది. సుదీర్ఘమైన షెడ్యూల్ ప్రేక్షకులను కట్టిపడేయనుంది. మరో రెండు కొత్త జట్లు ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వబోతోన్నాయి. ఐపీఎల్ టైటిల్ కోసం జరిగే పోరు ఇకపై మరింత ఉత్కంఠతగా మారనుంది. 
 
ఐపీఎల్‌లో ఇప్పటికే ఎనిమిది జట్లు కొనసాగుతున్నాయి. ఈ సంఖ్య పెరగబోతోంది. 10కి చేరుతుంది. దీనితో పాటు ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరుగుతుంది. సుదీర్ఘమైన షెడ్యూల్ ఉంటుంది ఇకమీదట. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత నైట్ రైడర్స్ జట్లకు తోడుగా మరో రెండు కొత్త టీమ్స్ రానున్నాయి.
 
అక్టోబర్ 17వ తేదీన ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభం కాబోతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా- 24వ తేదీన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఉంటుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ చారిత్రాత్మక మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే- బీసీసీఐ ఈ రెండు కొత్త ఐపీఎల్ జట్ల వివరాలను వెల్లడిస్తుంది.