గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (10:28 IST)

వరుసగా రెండో రోజు కూడా 20 వేలకు దిగువనే...

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నాయి. వరుసగా రెండో యేడాది కూడా ఈ కేసుల సంఖ్య 20 వేలకు దిగువున నమోదయ్యాయి. ఈ యేడాది మార్చి 11వ తర్వాత తొలిసారిగా మంగళవారం (సెప్టెంబర్‌ 28) 20 వేల కంటే తక్కువగా కేసులు నమోదయ్యాయి. మంగళవారం 18,795 వేల కేసులు నమోదయ్యాయి. బుధవారం కూడా ఇదే సంఖ్యలో నమోదయ్యాయి. 
 
గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,870 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,37,16,451కు చేరింది. ఇందులో 3,29,86,180 మంది కరోనా నుంచి బయటపడగా, 4,47,751 మంది బాధితులు మరణించారు. 
 
మరో 2,82,520 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 28,178 మంది కరోనా నుంచి బయటపడగా, 378 మంది మృతిచెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 11,196 కేసులు ఉన్నాయని, 149 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
మరోవైపు, దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. మంగళవారం ఒకేరోజు 54,13,332 మందికి కరోనా టీకాలు పంపిణీ చేశారు. దీంతో ఇప్పటివరకు 87,66,63,490 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. 
 
కాగా, సెప్టెంబర్‌ 28 వరకు దేశంలో 56,74,50,185 నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) తెలిపింది. ఇందులో నిన్న ఒకేరోజు 15,04,713 మందికి పరీక్షలు చేశామని పేర్కొన్నది.