ఆస్ట్రేలియాకు షాకిచ్చిన ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్!
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ మహిళా జట్టు తేరుకోలేని షాకిచ్చింది. ఆస్ట్రేలియా జట్టు 26 వరుస విజయాల రికార్డుకు బ్రేక్ వేసింది. ఆదివారం ఆ టీమ్‌తో జరిగిన మూడో వన్డేలో 2 వికెట్ల తేడాతో గెలిచింది. అంతేకాదు వన్డేల్లో ఇండియన్ వుమెన్స్ టీమ్ చేజ్ చేసిన అత్యధిక స్కోరు కూడా ఇదే కావడం విశేషం.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్... ప్రత్యర్థి ముంగిట 265 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది ఈ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు మరో 3 బంతులు మిగిలి ఉండగా ఛేదించింది. అయితే ఇప్పటికే తొలి రెండు వన్డేలు గెలిచిన ఆస్ట్రేలియా 2-1తో సిరీస్ ఎగరేసుకుపోయింది. ఇక ఈ నెల 30 నుంచి ఈ రెండు టీమ్స్ ఏకైక పింక్ బాల్ టెస్ట్‌లో తలపడనున్నాయి.
రెండో వన్డేలోనూ గెలిచేలా కనిపించిన ఇండియన్ వుమెన్స్ టీమ్.. చివరి బంతికి ఝులన్ గోస్వామి నోబాల్ వేయడంతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే మూడో వన్డేలో మాత్రం అలాంటి తప్పిదానికి తావివ్వకుండా జాగ్రత్త ఆడి గెలుపుతో పాటు.. ఆసీస్ రికార్డుకు బ్రేక్ వేశారు.