మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2020 (11:03 IST)

హరీష్ శంకర్ - బండ్ల గణేష్ ట్విట్టర్ వార్‌కి శుభం కార్డు పడినట్టేనా?

'గబ్బర్ సింగ్' మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో తెలిసిందే. ఈ మూవీ డైరెక్టర్ హరీష్ శంకర్, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా గొడవపడ్డారు. ఇంతకీ మేటర్ ఏంటంటే... 'గబ్బర్ సింగ్' మూవీ విడుదలై ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరికీ థ్యాంక్స్ చెబుతూ డైరెక్టర్ హరీష్ ఒక లెటర్ రిలీజ్ చేసారు. అందులో అందరి గురించి చెప్పారు కానీ... నిర్మాత బండ్ల గణేష్ పేరు మాత్రం ప్రస్తావించలేదు. అయితే ఆ తర్వాత ఇది గుర్తించిన హరీష్ శంకర్ మరో ట్వీట్ చేస్తూ బండ్లకు కృతజ్ఞతలు తెలిపాడు.
 
అయితే, హరీష్ శంకర్ తన పేరు చెప్పకపోవడంతో బండ్ల గణేష్ బాగా హార్ట్ అయ్యారు. అవ్వడమేకాకుండా హరీష్ శంకర్ రీమేక్ సినిమాలను మాత్రమే తీయగలడని.. ఇక జీవితంలో ఆయనతో సినిమాలు తీయనంటూ మనసులో ఉన్న కోపాన్ని అంతటిని బయటకు వెళ్ళగక్కేశాడు. కొన్ని రోజుల పాటు ఈ వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. 
సినీ ఇండస్ట్రీలో మనస్పర్థలు రావడం.. ఒకరిపై ఒకరు అలగడం.. మళ్ళీ ఒకటవ్వడం అనేది సహజంగా జరిగే విషయాలే. 
 
అయితే.. కరోనా నుంచి కోలుకున్న బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందిస్తూ.. 'అది అన్నదమ్ముల మధ్య అప్పుడప్పుడు వచ్చే చిన్న గొడవ లాంటిది. ఆయన మంచి డైరెక్టర్. అంత పెద్ద డైరెక్టర్ అవకాశం ఇస్తే సినిమా ఎందుకు చేయను. ఆ రోజేదో కోపంలో అలా అనేశాను అన్నారు. రీసెంట్‌గా బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా మళ్ళీ హరీష్‌ని క్షమించమని కోరాడు. 
 
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హరీష్ శంకర్ ఫైనెస్ట్ డైరెక్టర్. సార్.. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే వదిలేయండి. మీతో నేను ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను చేయాలనుకుంటున్నాను అని బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. 
 
దీనికి హరీష్ శంకర్ స్పందిస్తూ... సార్ దయచేసి అలా అనకండి. మీరు నా పెద్దన్నయ్య లాంటి వారు. నా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్... సినిమా మనకంటే చాలా గొప్పది. అందుకే గొప్ప సినిమాలతో మరింత గొప్పగా జీవిద్దాం అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఇక వీరి గొడవకి ఎండ్ కార్డ్ పడినట్టే అంటున్నారు అదీ.. సంగతి.