మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2020 (19:01 IST)

పవన్ - హరీష్ శంకర్ మూవీ స్టోరీ సీక్రెట్ ఇదే (video)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీతో రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆతితూచి అడుగులు వేస్తాడు. ఒక్కొ సినిమా చేస్తాడు అనుకుంటే... వరుసగా సినిమాలు ఎనౌన్స్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. పవన్ పుట్టినరోజున హరీష్ శంకర్‌తో మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.
 
ఈ ఫస్ట్ లుక్‌లో ఓవైపు భ‌గ‌వ‌ద్గీత‌, గులాబీ పువ్వుతో పాటు.. పిస్తోలూ, ఇండియా గేట్ చూపించడంతో ఈ ప్రాజెక్ట్ పైన మాంచి క్రేజ్ ఏర్పడింది. రీసెంట్‌గా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. 
 
అది ఏంటంటే... ఇందులో పవన్ కళ్యాణ్ లెక్చరర్‌గా నటించనున్నారని. ఇప్పుడు మరో న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే... ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పోలీస్‌గా న‌టిస్తాడ‌ని, కాదు.. కాదు ప‌వ‌న్ లెక్చ‌ల‌ర్‌గా న‌టిస్తాడ‌ని ప్రచారం జరుగుతుంది. అయితే... ప‌వ‌న్ పోలీసే అని, కాక‌పోతే కొన్ని స‌న్నివేశాల్లో లెక్చ‌ల‌ర్‌గా క‌నిపించాల్సి వ‌స్తుంద‌ని అంటున్నారు. మిర‌ప‌కాయ్‌లో అంతే. పోలీస్ ఆఫీస‌ర్ అయిన హీరో... కొన్ని సన్నివేశాల్లో లెక్చరర్‌గా మారిపోతాడు.
 
ఈసారీ అంతేలా క‌నిపిస్తోంది. హ‌రీష్ శంక‌ర్‌ని ద‌ర్శ‌కుడిగా నిల‌బెట్టిన సినిమా మిర‌ప‌కాయ్. ఇప్పుడు ఈ సినిమా కూడా మిరపకాయ్ స్టైల్ లోనే ఉంటుందని.. ఇంకా చెప్పాలంటే.. మిరపకాయ్ 2 అంటూ ప్రచారం జరుగుతుంది. మరి.. గబ్బర్ సింగ్‌తో సక్సెస్ అందించిన హరీష్ శంకర్ ఈసారి కూడా పవన్‌తో సక్సెస్ సాధిస్తాడో లేదో చూడాలి.