మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 6 అక్టోబరు 2020 (21:40 IST)

పవన్ డైరెక్టర్ వెబ్ ఫిల్మ్ చేస్తున్నాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ వెబ్ ఫిల్మ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. పవర్ స్టార్ డైరెక్టర్ ఎవరు..? ఏంటా వెబ్ ఫిల్మ్ అనుకుంటున్నారా..? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో గబ్బర్ సింగ్ అనే బ్లాక్‌బస్టర్ అందించి సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్. పవన్‌తో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. కథ రెడీగా ఉంది. నిర్మించేందుకు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రెడీగా ఉంది.
 
అయితే.. పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం వకీల్ సాబ్ అనే సినిమా చేస్తున్నారు. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ జరుగుతుంది. త్వరలోనే పవన్ షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఈ సినిమా తర్వాత విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో మూవీ చేయనున్నారు. ఇది పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఈ పిరియాడిక్ మూవీ జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.
 
ఈ సినిమా తర్వాత హరీష్‌ శంకర్‌తో సినిమా చేయనున్నాడు. అయితే.. ఇదంతా జరగడానికి కాస్త టైమ్ పడుతుంది కనుక ఈ గ్యాప్‌లో హరీష్ శంకర్ వెబ్ ఫిల్మ్ కోసం ఓ స్టోరీ రెడీ చేసారు. యువ నిర్మాత బన్నీ వాసుతో కలిసి హరీష్ శంకర్ ఈ వెబ్ ఫిల్మ్‌ని నిర్మించనున్నారు.
 
ఇప్పుడిప్పుడు షూటింగ్స్ స్టార్ట్ అవుతుండడంతో ఈ వెబ్ ఫిల్మ్ షూటింగ్‌ని త్వరలోనే ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ వెబ్ ఫిల్మ్‌ని ఆహా కోసం చేస్తున్నారని తెలిసింది. అయితే.. ఇందులో నటించే నటీనటులు ఎవరు అనేది త్వరలోనే ప్రకటించనున్నారని సమాచారం.