గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 31 ఆగస్టు 2020 (21:15 IST)

పవన్ ఫ్యాన్స్‌కి హరీష్ శంకర్ సర్‌ఫ్రైజ్ గిఫ్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న వకీల్ సాబ్ మూవీ ఈపాటికే రిలీజ్ కావాలి కానీ.. కరోనా కారణంగా ఆగింది. ఎప్పుడెప్పుడు పవన్ షూటింగ్‌కి టైమ్ ఇస్తాడో షూటింగ్ స్టార్ట్ చేద్దామా అని వేణు శ్రీరామ్, దిల్ రాజు ఎదురుచూస్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న. ఈ సందర్భంగా వకీల్ సాబ్ మూవీ నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఎస్.ఎస్. తమన్ మ్యూజిక్ వర్క్‌లో బిజీగా ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే... పవన్ పుట్టినరోజు సందర్భంగా హరీష్ శంకర్ ఫ్యాన్స్‌కి సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్నారని తెలిసింది.
 
ఇంతకీ ఏంటది అంటే.. పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ చేయనున్న మూవీ టైటిల్ రిలీజ్ చేయనున్నారని తెలిసింది. టైటిల్‌తో పాటు హీరోయిన్ ఎవరు అనేది కూడా ఎనౌన్స్ చేయనున్నారట. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమా క్రిష్‌తో చేస్తున్న సినిమా తర్వాత స్టార్ట్ కానుంది. హరీష్ శంకర్ ఎనౌన్స్ చేయనున్న టైటిల్ ఫ్యాన్స్‌కి విశేషంగా ఆకట్టుకుంటుందని టాక్ వినిపిస్తుంది. మరి.. ఆ టైటిల్ ఏంటో తెలుసుకోవాలంటే... సెప్టెంబర్ 2 వరకు ఆగాల్సిందే.