ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (18:25 IST)

ఒంటరి మహిళను, బాధ పెట్టకండి: పవన్ అభిమానులకు రేణు వేడుకోలు

పవన్ కళ్యాణ్‌తో విడిపోయి ప్రస్తుతం ప్రశాంతంగా జీవిస్తోంది రేణు దేశాయ్. ఇది అందరికీ తెలిసిందే. అయితే రేణు దేశాయ్ గురించి మాత్రం అప్పుడప్పుడు కొన్ని విషయాలు తీవ్ర చర్చకు దారితీస్తోంది. అందులోను పవన్ కళ్యాణ్ అభిమానులైతే రేణు గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు. కానీ అది రేణుకు ఎంతమాత్రం ఇష్టం లేదు. 
 
తాజాగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో కొనిచ్చిన 5 కోట్ల రూపాయల ఇంటికి రేణు షిఫ్ట్ అవుతోందంటూ ఒక ప్రచారం నడుస్తోంది. అంతేకాదు మీడియాలో కూడా పెద్దఎత్తున వార్తలొచ్చాయి. నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇల్లు కొన్నాను. దయచేసి ఏది పడితే అది స్ప్రెడ్ చేయకండి. 
 
నాకంటూ కొన్ని మనోభావాలు ఉన్నాయి. వాటిని దెబ్బతీయకండి. నేను నా ఇద్దరు పిల్లలు ప్రశాంతంగా ఉన్నాం. కొత్త ఇంట్లోకి వెళ్ళబోతున్నాం. కొత్త ఇంటికి నా మాజీ భర్తకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ట్విట్టర్, ఫేస్ బుక్‌లలో ట్వీట్ చేసింది రేణు దేశాయ్. భర్త అవసరం లేదు.. ఆయన డబ్బు మాత్రం కావాలా అంటూ కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు సందేశాలు పంపడంతో రేణు దేశాయ్ ఇలా స్పందించిందట.