శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 జనవరి 2020 (15:36 IST)

ఆద్య ఒక్కోసారి తన తండ్రిలా, నాలా, వాళ్ల నాన్నమ్మలా ఉంటుంది.. (Video)

సినీనటి, దర్శకురాలు రేణూ దేశాయ్ పవర్ స్టార్ పవన్‌కు దూరమై ప్రస్తుతం పిల్లలతో కలిపి పూణెలో నివాసముంటున్నారు. ఆ మధ్యలో ఓ ఇంటర్వ్యూలో త్వరలోనే తనకు ఓ తోడును వెతుక్కోబోతున్నానంటూ తెలిపింది. అందుకు తగ్గట్లుగానే కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కానీ, ఐదు నెలలు గడుస్తోన్న పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు రేణూదేశాయ్. తాజాగా రేణూదేశాయ్ పిల్లలకు సంబంధించిన ప్రతి అప్డేట్‌ను నెటిజన్లతో పంచుకుంటున్నారు.
 
తాజాగా టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్ఠార్ పవన్ కళ్యాణ్ తన కుమార్తె ఆద్యతో కలిసి దిగిన ఫోటో ఒక ఫొటోను రేణూ దేశాయ్ ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఫోటోతో పాటు ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు. కొన్ని సార్లు ఆద్య చూడటానికి తన తండ్రిలా కలిపిస్తుంది. మరికొన్ని సార్లు నాలా కలిపిస్తుంది. వాళ్ల నాన్నమ్మలా ఉంటుందని అంటూ.. ఓ ఎమోజీని కూడా పెట్టారు. 
 
అంతేకాకుండా నా కెమెరా ఫేవరెట్ పర్సన్ ఆద్య అని ఇస్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆమె ఈ ఫొటోను షేర్ చేసిన ఒక గంట వ్యవధిలోను 27మందిపైగా లైక్ చేశారు. కానీ ఇటీవలే కుమారుడు అకీరా ఫోటోపై పవన్ కళ్యాణ్ అభిమాని పెట్టిన కామెంట్‌పై ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐతే తాజాగా ఆద్య తండ్రిలా వుంటుందని రేణూ దేశాయ్ పోస్టు చేసిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. పవర్ ఫ్యాన్సును బాగా ఆకట్టుకుంటోంది.