గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 6 ఫిబ్రవరి 2020 (22:42 IST)

వేళాపాళా లేకుండా వచ్చేస్తున్నారు... ఏం చేయాలి? శ్రీముఖి అసహనం

శ్రీముఖి క్రేజ్ బిగ్ బాస్ షో తర్వాత ఓ స్థాయిలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆమెతో కలిసి ఫోటోలు దిగడానికి, ఆమెతో మాట్లాడటానికి చాలామంది ఆమె ఇంటి వద్ద గేటు ముందు పడిగాపులు కాస్తున్నారట. మొదట్లో ఎంతో సహనంతో అందరితో ఫోటోలు దిగుతూ వచ్చిన శ్రీముఖికి ఈమధ్య కాలంలో ఇది మరీ ఎక్కవపోయింది. 
 
గురువారం ఉదయం ఆమె షూటింగుకి వెళ్లే సమయంలో అకస్మాత్తుగా... అక్కా నీకోసమే వచ్చా.. నీతో ఫోటోలు దిగాలంటూ వచ్చేసరికి వారికి ఏం చెప్పాలో తెలియక కారులో ఎక్కేసి వెళ్లిపోయింది శ్రీముఖి. ఆమె ఇలా ఎందుకు చేసిందంటూ చర్చ మొదలైంది. దీనిపై శ్రీముఖి క్లారిటీ ఇచ్చింది. 
ప్రస్తుతం నేనొక షో చేస్తున్నాను. ఒకేసారి 3 ఎపిసోడ్లు అయ్యేసరికి రాత్రి 3 గంటలయ్యింది. మళ్లీ ఉదయాన్నే నిద్రలేచి షూటింగుకి వెళ్లాలి. ఇలా తీరిక లేకుండా వున్న సమయంలో కొందరు అభిమానులమంటూ, ఫోటోలు దిగాలంటూ వచ్చేస్తున్నారు. అలాంటివారు నన్ను కలవాలనుకుంటే ముందుగా నాకు సమాచారం ఇచ్చి ఆ పని చేయవచ్చు. 
అప్పుడు నేను ఫోటోలే కాదు కొద్దిసేపు మాట్లాడే అవకాశం కూడా వుంటుంది. అంతేకాని నాకోసం ఎక్కడిడెక్కడి నుంచో రావద్దు. గంటల తరబడి నాకోసం ఇంటి గేటు ముందు నిలబడి వుండవద్దు. ప్లీజ్ అంటూ శ్రీముఖి కోరుకుంటుంది. మరి శ్రీముఖి విన్నపాన్ని చూసైనా అభిమానులు ఎవ్వరూ ఆమె కోసం రాకుండా వుంటారో లేదో చూడాలి.