సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 నవంబరు 2019 (11:13 IST)

శ్రీముఖి కొత్త అవతారం.. మ్యూజిక్‌తో మ్యాజిక్ చేస్తుందట..

బిగ్ బాస్ రన్నరప్ శ్రీముఖి కొత్త అవతారం ఎత్తనుంది. తన ఫ్యాన్సును ఖుషీ చేసే షో చేస్తోంది. స్టార్ మ్యూజిక్‌లో శ్రీముఖి కొత్త అవతారం ఎత్తబోతోంది. సెలబ్రేషన్స్ విత్ సెలబ్రిటీ పేరుతో ఓ కొత్త మ్యూజికల్ షోకు శ్రీముఖి హోస్ట్ చేయబోతోంది. ఇందులో అంతా మ్యూజిక్ మేజిక్ చేస్తానని శ్రీముఖి చెప్తోంది.

దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా స్టార్ మ్యూజిక్ రిలీజ్ చేసింది. స్టార్ మ్యూజిక్ రీలోడెడ్ పేరుతో ఉన్న ఈ వీడియోలో శ్రీముఖి డ్యాన్స్‌లు, పాటలతో దుమ్మురేపుతోంది. 
 
సెలబ్రిటీల గేమ్‌ షోలకు బుల్లితెర వీక్షకుల నుంచి బాగా ఫాలోయింగ్ ఉంది. అయితే, కేవలం టాక్ షో మాత్రమే కాకుండా... వారితో పాటలు పాడించడం, ఆటలు ఆడించడం.. నవ్వించడం.. కవ్వించడం వంటి కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేయబోతోంది శ్రీముఖి. ఫుల్ ఫన్ గ్యారెంటీ అంటున్న శ్రీముఖి.. ఈ షోను అస్సలు మిస్ అవ్వొద్దని.. అవసరమైతే అలాంటి పెట్టుకొని మరీ చూడాలని పిలుపునిస్తోంది.