సంబంధిత వార్తలు
- బిగ్ బాస్ ఇంట్లో 'ముఠామేస్త్రీ', మెగా ఫ్యాన్స్ రాకెట్ ఓట్లు, వెనకంజలో శ్రీముఖి, ఏమయినా జరగొచ్చు
- శ్రీముఖికి కౌంటరిచ్చిన హేమ.. అక్కా నువ్వు తోపు అన్న రాహుల్ (Video)
- విన్నర్ ఎవరో తేలిపోనుంది.. బాబా భాస్కర్ బిగ్ బాస్‌తో మాట్లాడాడు..
- రిలేషన్షిప్ గురించి బయటపెట్టిన శ్రీముఖి, అతడితో బ్రేకప్ అయ్యాక చనిపోవాలనుకుందట...
- శ్రీముఖి బర్త్ డే రోజునే అది జరిగిపోయింది: బిగ్ బాస్ 3పై హేమ బిగ్ బాంబ్
బిగ్ బాస్ షో ముగిసినా శ్రీముఖికి లక్ లక్కలా అంటుకుందిగా (Video)
బిగ్ బాస్ 3 సీజన్ ముగిసింది. ఐతే బిగ్ బాస్ ఇంట్లో శ్రీముఖి అరుపులు, కేకలు గురించి వేరే చెప్పక్కర్లేదు. ఇక నాగార్జున అయితే అడిగి మరీ కేకలు వేయించుకున్నారు. జనం కూడా ఆ రేంజిలోనే స్పందించారు. మొత్తమ్మీద బిగ్ బాస్ పుణ్యమాని శ్రీముఖి క్రేజ్ అమాంతం మారిషస్ దీవుల దాకా వెళ్లిపోయింది. అదేనండీ, ఇటీవలే శ్రీముఖి కాస్త గ్యాప్ తీసుకుని హ్యాపీగా అక్కడ ఎంజాయ్ చేసి వచ్చింది కదా.
ఇక అసలు విషయానికి వస్తే శ్రీముఖిని మెయిన్ లీడ్ చేసుకుని మా టీవిలో రెండు పెద్ద ప్రోగ్రాములు రెడీ అయిపోతున్నాయట. బుల్లితెర రాములమ్మ అంటూ శ్రీముఖికి బిరుదు కూడా తగిలించారు కనుక ఇకపై బిగ్ బాస్ ఇంట్లోనే కాదు బుల్లితెరపైన కూడా అరుపులు, కేకలు జనం వినాల్సి వుంటుంది.
ఐతే ప్రస్తుతం శ్రీముఖి టాప్ యాంకర్లకు గట్టి పోటీ ఇస్తూ సూపర్ సోనిక్ విమానంలో దూసుకుని వెళ్లిపోతోందట. మొత్తమ్మీద శ్రీముఖికి లక్... లక్కలా అంటుకున్నట్లు లేదూ...?
