శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మనీల
Last Updated : శుక్రవారం, 25 అక్టోబరు 2019 (11:51 IST)

రిలేషన్‌షిప్ గురించి బయటపెట్టిన శ్రీముఖి, అతడితో బ్రేకప్ అయ్యాక చనిపోవాలనుకుందట...

బుల్లితెర మీద సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోన్న బిగ్‌బాస్ 3 రియాల్టీ షో క్లైమాక్స్‌కు చేరుకుంది. బిగ్ బాస్ మూడో సీజన్ త్వరలో పూర్తి కానున్న నేపథ్యంలో ఈ సారి బిగ్‌బాస్ విన్నర్ ఎవరో తెలుసుకునేందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో బిగ్‌ బాస్ హౌస్‌లో టాస్క్‌లు, సభ్యుల ఆటలు రసవత్తరంగా మారాయి. ఇక మరికొన్ని రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరుగనుంది. 
 
టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్‌ హౌస్‌లో పోటీదారుల్లో ఒక్కొక్కరు తమ లైఫ్ సీక్రెట్స్‌ను బయటపెట్టారు. ఈ క్రమంలో శ్రీముఖి తన లవ్‌బ్రేకప్‌ను బయటపెట్టింది. గట్టిపోటీదారుగా ఉన్న శ్రీముఖి తన ప్రేమకు సంబంధించిన రహస్యాలను బయటపెట్టేసింది. లవ్ ఫెయిల్యూర్ కావడంతో ఒకానొక దశలో చనిపోదామనుకున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. 
 
తన వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటి వరకు తానెక్కడా బయటపెట్టలేదన్న శ్రీముఖి మాట్లాడుతూ.. తనకు రిలేషన్‌షిప్ ఉందని, అతడితో అంతా ఓకే అనుకున్న సమయంలో తమ రిలేషన్‌షిప్‌లో అనుకోకుండా మలుపు తిరిగిందని తెలిపింది. ఆ తర్వాత తమ రిలేషన్ పూర్తిగా దెబ్బతిందని వివరించింది. అది తన జీవితంలో ‘అగ్లీ బ్రేకప్’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమయంలో చనిపోదామన్న ఆలోచన కూడా వచ్చిందని శ్రీముఖి పేర్కొంది.