సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: గురువారం, 24 అక్టోబరు 2019 (19:05 IST)

బిగ్ బాస్ తెలుగు 3 విజేత అతనే, ఎవరు?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ విజయవంతంగా 90 రోజులు పూర్తి చేసింది. బిగ్ బాస్ టాస్క్‌లను కంటెస్టెంట్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడంతో ఒక్కో కంటెస్టెంట్ 200 చొప్పున ఏడుగురికి 1400 పాయింట్లు ఇచ్చారు బిగ్ బాస్. కానీ డ్రిల్స్ విషయంలో నియమాలను పాటించని కారణంగా లగ్జరీ బడ్జెట్లో కోత విధించాడు బిగ్ బాస్. ఇదిలా ఉంటే షో చివరి దశకు చేరుకునే సరికి ఫైనల్ విజేత ఎవరన్న దానిపై ప్రేక్షకుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
 
ఇప్పటికే వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, శ్రీముఖి, అలీ, రాహుల్ ఫైనల్ లిస్ట్‌లో ఉన్నారు. అయితే వీరందరూ టాస్క్‌లలో బాగా కష్టపడుతూ ముందుకు సాగుతున్నారు. కొందరు వరుణ్ సందేశ్ విజేతగా నిలుస్తారంటుంటే మరికొందరు శ్రీముఖి అని ఇంకొందరు రాహుల్ అని చెబుతున్నారు. వీళ్ళందరి కంటే బాబా భాస్కర్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది.
 
రేలంగి మామయ్యగా బిగ్ బాస్ హౌస్‌లో పేరు తెచ్చుకున్న బాబా భాస్కర్ ఇప్పటివరకు ఎవరితోను గొడవ పడలేదు. అంతేకాకుండా ప్రతి కంటెస్టెంటుతో స్నేహపూర్వకంగా మెలగుతూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఈ వారం భార్యను కాపాడేందుకు వరుణ్ సందేశ్ తనకున్న ఇమేజ్‌ను తగ్గించుకున్నారు. ఇది బాబా భాస్కర్‌కు బాగా కలిసొచ్చింది. మరోవైపు బిగ్ బాస్‌ను ఒకటి వెంటాడుతోంది. మొదటి సీజన్‌ను ఒక సారి పరిశీలిస్తే షో చివరి దశకు చేరుకునేటప్పటికి హరితేజకు ఎక్కువ మార్కులు పడ్డాయి. 
 
ఆమెకు టైటిల్ రావడం ఖాయమని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా శివబాలాజీ విజేతగా నిలిచాడు. ఇక అతను టైటిల్ గెలవడంతో పవన్ ఫ్యాన్స్ హస్తం ఉందని ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. వరుణ్ సందేశ్ విజేతగా నిలుస్తాడని ప్రచారం జరుగుతున్నా.. బాబా భాస్కర్ టైటిల్ గెలవడం ఖాయమని తెలుస్తోంది. అతను తమిళయన్ అన్న విషయం పక్కనబెడితే హౌస్‌లో తప్పులు చేసిన దాఖలాలు లేవని అంటున్నారు. పైగా అతడికి బిగ్ బాస్ ఫాలోయెర్లు విపరీతంగా ఓట్లు వేస్తున్నట్లు తెలుస్తోంది.