సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 అక్టోబరు 2019 (14:55 IST)

బిగ్ బాస్ తెలుగు.. ఈ వారం ఎలిమినేషన్‌లో ఎవరున్నారు?

బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్‌కు వీకెండ్ వచ్చేసింది. ఈ వీకెండ్ హౌస్ నుంచి ఎవరు నామినేట్ అవుతారనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఇప్పటికే 12 వారాల ను పూర్తిచేసుకుంది బిగ్ బాస్ షో. కాగా ఇంకో రెండు వారాల్లో బిగ్ బాస్ షో ముగియనుంది. ప్రస్తుతం బాబా భాస్కర్, శ్రీముఖి, వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, శివ జ్యోతి, వితికలు మాత్రమే హౌస్‌లో మిగిలి వున్నారు. 
 
వీరిలో బిగ్ బాస్ విన్నర్ ఎవరు? స్టార్ మా ఇచ్చే 50 లక్షల ప్రైజ్‌మనీని ఎవరు అందుకుంటారని ప్రేక్షకులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. అంతేగాకుండా ఈ వీక్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై కూడా ప్రేక్షకులకు ఆసక్తి నెలకొంది. ఈ వీక్‌లో బయటికి వెళ్లడానికి శివజ్యోతి, వితిక, బాబా భాస్కర్ కానీ బయటకు వెళ్లే ఛాన్స్ ఉందని ప్రేక్షకులు భావిస్తారు.
 
వీళ్ళ ముగ్గుల్లో ఎక్కువగా వితిక పేరు వినిపిస్తుంది. ఎందుకంటే గత వారం తన ప్రవర్తన కారణంగా కాస్త నెగటివిటీ మూటగట్టుకుంది వితిక. సో ఈ వారం వితిక హౌస్ నుంచి బయటికి వెళ్లే ఛాన్సుందని టాక్ వస్తోంది