బిగ్ బాస్ హౌస్‌లోకి మన్మథుడు.. ఆ ఇద్దరికీ స్టార్ ఇచ్చారు..?

సెల్వి| Last Updated: గురువారం, 10 అక్టోబరు 2019 (14:12 IST)
బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్‌లో సందడి నెలకొంది. బిగ్ బాస్ ఇంట్లోకి మన్మథుడు ఎంట్రీ ఇచ్చి.. ఇంటి సభ్యులందరినీ సరదాగా ఆటలు ఆడించాడు. ఇందులో భాగంగా అలీరెజా గంతలు కట్టుకుని మహేశ్‌ను సుందరాంగుడిగా ముస్తాబు చేశాడు.

వరుణ్‌ కళ్లు మూసుకోగా, కళ్లకు గంతలు కట్టుకున్న శ్రీముఖి అతనికి వెనకనుంచి కేక్‌, అరటిపండు, బ్రెడ్‌ తినిపించి నీళ్లు తాగించింది. ఇక బాబా భాస్కర్‌ పిండిగిన్నెలో కేవలం నోటి సహాయంతో 5 కాయిన్స్‌ తీశాడు. శివజ్యోతి అయిదు రకాల పచ్చి కూరగాయలను తింది.

రాహుల్‌ ఓ పాటను కిలికి భాషలో మార్చి పాడాడు. మహేశ్‌కు బెల్లీ డాన్స్‌ వేయాలని చిట్టీ రాగా మేం చూడలేం బాబోయ్‌ అంటూ శ్రీముఖికి పాస్‌ చేశారు. ఇక శ్రీముఖి బెల్లీ డాన్స్‌తో అదరగొట్టింది. మహేశ్‌ శివజ్యోతికి కేక్‌ రుద్దాడు. వితిక బెలూన్‌లోని హీలియంను పీల్చి నోటిలో పెట్టుకుని సుర్రు సుమ్మైపోద్ది అని డైలాగ్‌ చెప్పింది. రాహుల్‌ కూడా హీలియం పీల్చుకుని ఏమైపోయావే పాట పాడాడు. దీంతో ఇంటిసభ్యులు పడీపడీ నవ్వారు. శివజ్యోతి, బాబా భాస్కర్‌, శ్రీముఖి, మహేశ్‌, వరుణ్‌లు కూడా హీలియం పీల్చుకుని పాట పాడారు.

ఈ క్రమంలో శివజ్యోతి, వరుణ్‌లు ఇద్దరూ స్టార్‌ ఆఫ్‌ ద హౌస్‌గా నిలిచారు. వీరికి ఈ వారం అంతా స్పెషల్‌ డిన్నర్‌ ఉంటుందని నాగార్జున ప్రకటించాడు. ఇక ఇంటిసభ్యులు వారి జీవితంలో సాధించిన విజయాలను నాగ్‌తో పంచుకున్నారు. ఇక రాహుల్‌ పునర్నవిని ఇప్పటికీ గుర్తుచేసుకుంటూనే ఉన్నాడు. పున్ను ఇంట్లో ఉండటం కన్నా వెళ్లడం మంచిదైందని వితిక అభిప్రాయపడింది.దీనిపై మరింత చదవండి :