శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 3 అక్టోబరు 2019 (19:59 IST)

నాన్న నాగ్ సినిమాలో నటించనని చెప్పిన నాగచైతన్య.. ఏమైంది?

నాగార్జున, నాగచైతన్య, నాగేశ్వరరావులు కలిసి నటించిన చిత్రం మనం. ఈ సినిమా బాక్సా ఫీస్ వద్ద అతి పెద్ద హిట్. మంచి కలెక్షన్లను సాధించింది. సినిమా విజయంతో అక్కినేని కుటుంబం సంతోషంలో మునిగింది కానీ..సినిమా షూటింగ్ మధ్యలోనే నాగేశ్వరరావు మరణించడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి తీసుకెళ్ళింది.
 
ఆ తరువాత అక్కినేని కుటుంబం నుంచి సినిమాలు వస్తుందని అందరూ భావించారు. సినిమాలు రావడమంటే వారి కుటుంబ సభ్యులు కలిసి నటించడమన్నమాట. అలా ఒకసినిమాకు ప్లాన్ చేసుకున్నాడు నాగార్జున. ఆ సినిమానే బంగార్రాజు. ఆ సినిమా చేస్తానని రెండు సంవత్సరాల క్రితమే చెప్పారు నాగార్జున. 
 
సోగ్గాడే చిన్ని నాయనో సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా తీస్తామని, అందులో ప్రధాన పాత్ర ధారిగా నాగచైతన్య ఉంటాడని చెప్పాడు. కానీ చివరకు నాగచైతన్య అందుకు ఒప్పుకోలేదట. ఇప్పటికే రెండు సినిమాల్లో బిజీగా ఉన్న నాగచైతన్య టైం ఖాళీ లేకుండా తిరుగుతున్నాడట. తండ్రి చేద్దామన్న సినిమా అయినా తనకు సమయం లేకపోవడంతో ఆ సినిమాలో నటించనని తెగేసి చెప్పేస్తున్నాడట నాగచైతన్య.  దీంతో సినిమా షూటింగ్ ను పోస్ట్ పోన్ చేసుకుందామా..లేకుంటే సినిమానే ఆపేద్దామా అన్న ఆలోచనలో ఉన్నారట నాగార్జున.