సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 13 అక్టోబరు 2019 (11:42 IST)

బిగ్ బాస్ మూడో సీజన్.. మహేషే ఎలిమినేట్ అవుతాడా..? రాహుల్ కూడా?

బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్‌లో భాగంగా ఈ వారం మహేష్, రాహుల్, వరుణ్ సందేశ్ నామినేషన్‌లో వున్నారు. ఈ ముగ్గురిలో ఎవరు ఇంటి నుంచి వెళ్తారనేదానిపై ఆసక్తి నెలకొంది. ఆదివారం రాత్రి ఎపిసోడ్‌తో ఆ విషయం కాస్త తేలనుంది.
 
ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. గత వారమే మహేష్ ఎలిమినేట్ కావాల్సి ఉన్నప్పటికి అదృష్టవశాత్తు సేఫ్ జోన్‌లో పడ్డాడు. ఈ వారం మాత్రం మహేష్ ఇంటి నుండి బయటకి వెళ్లడం ఖాయమని నెటిజన్లు అప్పుడే జోస్యం చెప్పేస్తున్నారు. 
 
గేమ్స్‌లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయకపోవడం, రెండు నాలుకల ధోరణితో విసిగిపోయిన నెటిజన్స్ మహేష్‌ని ఇంటి నుండి బయటకి పంపిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందని, మహేష్‌తో పాటు రాహుల్ కూడా ఎలిమినేట్ అవుతారని అంటున్నారు. మరి జరుగుతుందో తెలియాలంటే కొన్ని గంటల పాటు వేచి  చూడాల్సిందే.