సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 అక్టోబరు 2019 (11:18 IST)

శ్రీముఖికి పెళ్ళైతే పరిస్థితి ఏంటి? వెధవా అని తిడుతోంది బ్రో..

బిగ్ బాస్ హౌస్‌లో ఆసక్తికరమైన టాస్కులు జరుగుతున్న వేళ.. తాజా ఎపిసోడ్‌లో పునర్నవి, శ్రీముఖిలపై వరుణ్, రాహుల్ టాక్ హైలైట్‌గా నిలిచింది. తాజా ఎపీసోడ్ ఎప్పటిలాగే సాంగ్‌తో మొదలైంది. ఆ సాంగ్‌కు శ్రీముఖి, బాబా భాస్కర్‌లు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ అదరగొట్టారు. ఇక ఆ తర్వాత నుండి హౌస్‌ సభ్యులు గ్రూపు గ్రూపులుగా మారి యధావిధిగా గుసగుసలు మొదలు పెట్టారు. 
 
వాటిలో ముఖ్యంగా రాహుల్, వరుణ్‌లు హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న శ్రీముఖిని టార్గెట్ చేస్తూ జోకులేసుకున్నారు. శ్రీముఖి లౌడ్ స్పీకర్‌ అని పెళ్లి అయితే తన భర్త పరిస్థితి ఏంటో అని రాహుల్.. అమాయకంగా తన ఫ్రెండ్  వరుణ్‌ని అడిగాడు. 
 
ఏమో నాకేం తెలుసు.. పెళ్ళి అయ్యాక కూడా ఆమె అలాగే అరుస్తుందేమో.. ఒకవేళా కనుక అలాగే అరిస్తే అరుపులు వినిపించకుండా ఇయర్ ఫ్లగ్స్ కొనుక్కుంటాడేమో అంటూ రాహుల్ డౌట్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేశాడు వరుణ్.
 
అలాగే రాహుల్, వరుణ్‌తో మాట్లాడుతూ..  పునర్నవి నన్ను ఉదయ్యాన్నే వెధవ అని తిట్టిడంతోనే స్టార్ట్ చేసింది ఎందుకో తెలియడం లేదని వరుణ్‌తో చెప్పాడు. ఇందుకు వరుణ్ సమాధానం ఇస్తూ.. బ్రో ఇష్టంతో తిడుతుంది బ్రో అంటూ సర్ధి చెప్పాడు. మరో సందర్భంలో  రాహుల్ డెటాల్‌ను ఎక్కువ వాడేస్తున్నాడంటూ పునర్నవి, రాహుల్ పై అరిచింది.

దీనికి రాహుల్ ముందు తెలుసుకుని మాట్లాడు.. అరవకు అంటూ వెళ్లిపోయాడు. దీనిపై ఇంటి కెప్టెన్ శ్రీముఖి.. బాబా బాస్కర్‌తో మాట్లాడుతూ.. ఇక వీళ్లు సీరియస్‌గా గొడవ పడుతున్నారా? ఊరికే అలా చేస్తున్నారా.. అర్ధం కావడం లేదని.. ఇంతసేపు గొడవ పడి ఇప్పుడేమో ఒకరితో ఒకరు సరదాగా ఆడుకుంటున్నారని బాబా భాస్కర్‌తో శ్రీముఖి చెప్పింది. 
 
మరోవైపు బిగ్ బాస్ హౌస్‌లో గురువారం ఎపిసోడ్ చాలా ప్రశాంతంగా జరిగింది. ఈ వారం నామినేషన్‌లో మహేష్, రాహుల్, పునర్నవి, వరుణ్‌లు ఉన్నారు. వీరందరిలో మహేష్ వెళ్ళిపోతాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దానికి కారణాలు కూడా లేకపోలేదు. ఈ వారం నామినేషన్ ప్రక్రియ నుండి మొదలు పెడితే మహేష్ తప్పు మీద చేస్తున్నాడు. నామినేషన్ సమయంలో రాహుల్ మహేష్ రాళ్ళు లాక్కోవడానికి ప్రయత్నిస్తే డిఫెండ్ చేయడం మానేసి సీరియస్ అయ్యాడు.
 
అదీగాక నేను టాస్క్ ఆడను అంటూ మాట్లాడాడు. చివరికి శ్రీముఖి ఒప్పిస్తే గానీ టాస్క్ ఆడడానికి ఒప్పుకోలేదు. అప్పటి నుండే మహేష్ మీద ప్రేక్షకులకి వ్యతిరేకత పెరిగింది. ఇకపొతే గురువారం ఎపిసోడ్‌లో శ్రీముఖితో మాట్లాడుతూ, వరుణ్, వితికా గ్రూప్ మెంబర్స్ శ్రీముఖి గురించి ఏ విధంగా అనుకుంటారో పూసగుచ్చినట్టు శ్రీముఖికి చెప్పాడు.
 
గతంలో శ్రీముఖిపై నెగటివ్‌గా మాట్లాడి.. శ్రీముఖిని గురించి వరుణ్ గ్రూప్ ఏం మాట్లాడుతున్నారో వచ్చి చెప్తున్నాడు. ఈ ప్రవర్తన ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చడం లేదు. ఈ ప్రవర్తనే మహేష్ కొంపముంచేలా ఉందని ఈ వారం మహేష్ ఎలిమినేట్ అవుతాడని తెలుస్తోంది.