శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 26 సెప్టెంబరు 2019 (19:04 IST)

శ్రీముఖి-రవి పెళ్లి చూపులు ఈరోజు రాత్రి 9.30 నిమిషాలకు... బిగ్ బాస్ ఆ తర్వాత ఏం చేస్తావో?

బిగ్ బాస్ చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్ 3 రేటింగ్ నాగార్జున వచ్చినప్పుడు ఎపిసోడ్లు తప్పించి మిగిలినవన్నీ తుస్ మంటున్నాయని ఆడియెన్స్ కామెంట్లు పెడుతున్నారు. తమ సహనానికి పరీక్ష పెడుతున్నారంటూ చెప్పేస్తున్నారు. ఎప్పుడు చూసినా ఆ ఇద్దరు ఏడుస్తూ వుంటున్నారనీ, అలా వారిని చూడటం తమ వల్ల కావడంలేదని మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
 
బిగ్ బాస్ షో నడిపించడానికి చాలా తంటాలు పడుతున్నాడని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇదిలావుంటే ఈరోజు రాత్రి ఎపిసోడుకి సంబంధించి ఓ ప్రోమోను వదిలారు. అందులో శ్రీముఖి-రవికి పెళ్లిచూపులు జరుగుతున్నాయి. శ్రీముఖి చాలా చాలా సిగ్గుపడిపోతూ తల వంచుకుని గ్లాసుల్లో పానీయాన్ని తెచ్చి ఇచ్చి అలా కూర్చుండిపోయింది. 
 
ఈ సందర్భంలో బాబా భాస్కర్ ఏదో కామెంట్ చేశారు. శ్రీముఖి చెప్పిన సమాధానానికి అంతా పగలబడి నవ్వుతున్నారు. వాళ్లు నవ్వుతున్నారు సరే... ఆడియన్స్ నవ్వుతారా అనీ, మరి బిగ్ బాస్ ఆ తర్వాత ఎపిసోడ్లకు ఏమేం చేస్తారో, ఎలాంటి టాస్కులు ఇస్తారో మనం చూద్దాం. ఇప్పటికీ శ్రీముఖి సిగ్గులు చూడండి.