సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 అక్టోబరు 2019 (19:22 IST)

రాహుల్ రాగానే ఆ పని చేస్తానంటున్న పున్ను.. టైటిల్ విన్నర్ అతడేనా? (video)

పునర్నవి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన పున్ను.. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటోంది. కుటుంబ సభ్యులతో కలిసి పండగ చేసుకుంటోంది.

తాజాగా ఫేస్ బుక్ లైవ్‌లో ఫ్యాన్స్‌ను పలకరించింది. రాహుల్‌కు ఓటేయాలని కోరింది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెప్పింది. అంతేకాదు షో పూర్తి అయిన తర్వాత ఇద్దరం కలిసి ఫేస్ బుక్ లైవ్ పెడతానని పునర్నవి చెప్పింది.
 
ఈ నేపథ్యంలో రాహులే బిగ్ బాస్ మూడో సీజన్ టైటిల్ విన్నర్ అని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ షో ముగిసేందుకు ఇంకా రెండు వారాలే మిగిలి వున్న తరుణంలో ఈ వారం వితికా షేరు, శివజ్యోతి లేదా బాబా భాస్కర్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ముగ్గురిలో ఎలిమినేట్ అయ్యేది మాత్రం వితికా షేరే అంటున్నారు నెటిజన్స్. 
 
ఇక టైటిల్ ఫేవరేట్‌గా ముందు వరుసలో రాహుల్, అలీ రెజా, బాబా బాస్కర్, శ్రీముఖి, వరుణ్ సందేశ్‌లు ఉన్నారు. కాగా మొదటి నుంచి శ్రీముఖి రాహుల్‌ను టార్గెట్ చేస్తూ.. కావాలని రాహుల్‌ను రెచ్చగొడుతోంది. దాంతో శ్రీముఖి‌పై ఆడియన్స్‌లో నెగిటివ్ ఇంపాక్ట్ మొదలైంది. 
 
మరోవైపు వరుణ్ హౌజ్‌లో అందరితో కూల్‌గా వుంటూ.. ఇంట్లో గొడవలు జరగనీయకుండా చూస్తున్నాడు. మొదట వితికాను తోటి కంటెస్టెంట్‌గా చూసిన వరుణ్.. ఈ మధ్య తన భార్య వైపు కొంత పక్షపాతం చూపెడుతుండటంతో అతనిపై ఆడియన్స్‌లో నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. దీంతో రాహుల్‌కే జనాలు ఓటేసి గెలిపిస్తారని తెలుస్తోంది.