బిగ్ బాస్ ఇంట్లో 'ముఠామేస్త్రీ', మెగా ఫ్యాన్స్ రాకెట్ ఓట్లు, వెనకంజలో శ్రీముఖి, ఏమయినా జరగొచ్చు

Rahul-Srimukhi
ఐవీఆర్| Last Modified శనివారం, 2 నవంబరు 2019 (16:25 IST)
బిగ్ బాస్ 3 విన్నర్ ఎవరనేది తేలేందుకు మరికొన్ని గంటలే మిగిలి వుంది. ఈ నేపధ్యంలో బిగ్ బాస్ ఇంట్లో కాస్తదానికి కూడా ఓహో... ఆహో అంటూ అరుస్తూ కేకలు వేస్తూ నానా హంగామా చేసే శ్రీముఖి విన్నర్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఐతే ఇటీవల ముఠామేస్త్రీలోని ఈ పేటకు నేనే మేస్తిరీ.. నిరుపేదల పాలిట పెన్నిధీ.... పాటకు మెగాస్టార్ రీతిలో అదిరిపోయే స్టెప్పులు వేసిన రాహుల్ సిప్లిగంజ్ ఫాలోయింగ్ ఓవర్ నైట్లో పెరిగిపోయింది.

అసలే మెగాస్టార్ ముఠామేస్త్రీ చిత్రం, అందులోనూ ఆయనను అనుకరిస్తూ రాహుల్ వేసిన స్టెప్పులతో అమాంతం అతడికి క్రేజ్ పెరిగిపోయింది. దీనితో ఫైనల్లో శ్రీముఖి విన్నర్ అనే మాటకు గట్టి పోటీ వచ్చి పడింది. ఓటింగులో రాహుల్ దూసుకుపోతున్నాడు. పైగా అతడికి మెగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా తోడవడంతో ఓట్లు రాకెట్ వేగంలో పడిపోతున్నాయట. ఇలాగే సాగితే బిగ్ బాస్ విన్నర్ రాహుల్ కావడం ఖాయం. అప్పటిదాకా మనం అడిగినా మాట్లాడడు బిగ్ బాస్. చూద్దాం.దీనిపై మరింత చదవండి :