శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మనీల
Last Updated : బుధవారం, 23 అక్టోబరు 2019 (15:49 IST)

టికెట్ టు ఫినాలే గెలుచుకున్న రాహుల్... శ్రీముఖికి షాక్(video)

బుల్లితెర మీద సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోన్న బిగ్‌బాస్ 3 రియాల్టీ షో క్లైమాక్స్‌కు చేరుకుంది. బిగ్ బాస్ మూడో సీజన్ త్వరలో పూర్తి కానున్న నేపథ్యంలో ఈ సారి బిగ్‌బాస్ విన్నర్ ఎవరో తెలుసుకునేందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో బిగ్‌ బాస్ హౌస్‌లో టాస్క్‌లు, సభ్యుల ఆటలు రసవత్తరంగా మారాయి.

ఇక మరో రెండు వారాల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ నేపథ్యంలో టికెట్ టు ఫినాలే గెలిచేందుకు ఇంట్లో ఉన్న ఆరుగురు సభ్యులకు.. బ్యాటరీ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో రాహుల్ విజయం సాధించాడు. దీంతో అతడు నేరుగా ఫినాలేకు చేరుకున్నాడు. 
 
దీంతో శ్రీముఖికి గట్టి షాక్ తగిలినట్లైంది. అయితే బయట మంచి స్నేహితులైన రాహుల్, శ్రీముఖిలు హౌస్‌లోకి వెళ్లిన తరువాత బద్ధ శత్రువులుగా మారారు. దీంతో బయట వారి వారి అభిమానులు ఒకరినొకరు ఫైనల్‌ రాకూడదని ప్రయత్నాలు చేశారు. ఇక ఇప్పుడు రాహుల్‌ డైరక్ట్‌గా ఫైనల్‌కు వెళ్లడంతో ఇది ఒక రకంగా ఆమెకు పెద్ద షాక్ లాంటిదే.
 
మిగిలిన సభ్యులైన వరుణ్ సందేశ్, అలీ రెజా, బాబా భాస్కర్, శివజ్యోతిలతో పాటు శ్రీముఖి కూడా ఈ వారం ఎలిమినేషన్లో ఉంది. ఇవాళ ఇదిలా ఉంటే ఈ వారంలో ఇద్దరు సభ్యులు ఎలిమినేట్ అవుతారని.. మిగిలిన నలుగురు సభ్యులు ఫైనల్‌కు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అందులో నిజమెంతో తెలియాలంటే మూడు రోజులు ఆగాల్సిందే.