నాగబాబు ఇలా ముంచేస్తారనుకోలేదు: హైపర్ ఆది గోడు

ఐవీఆర్| Last Modified గురువారం, 21 నవంబరు 2019 (14:43 IST)
జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షోలో ఒక పక్క రోజా, మరో పక్క నాగబాబు జడ్జిలుగా వుండగా స్టేజి పైన హైపర్ ఆది, చమ్మక్ చంద్ర తమ స్కిట్లతో రెచ్చిపోతుంటారు. వీక్షకులను ఆకట్టుకునేందుకు తమదైన స్టయిల్లో సెటైర్లు వేస్తూ షోను రక్తి కట్టించేవారు.

ఐతే మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో ఆర్కే రోజా జబర్దస్త్ షోకి దూరమయ్యారు. ఆ తర్వాత క్రమంగా నాగబాబు కూడా ఈ షోకి రాంరాం చెప్పేశారు. ఐతే రోజా నిష్క్రమించినా ఇబ్బందిపడని జబర్దస్త్ టీం నాగబాబు దూరం కావడంతో తీవ్రమైన ఇబ్బందుల్లో పడిపోయారట.

వీరిలో హైపర్ ఆది కూడా వున్నారు. జడ్జిలుగా వుండి షోను రక్తి కట్టించే రోజా-నాగబాబు నిష్క్రమించడంతో హైపర్ ఆది కూడా షో నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇలా అందరూ వెళ్లిపోతే జబర్దస్త్ ఏంకానూ. అందుకే మల్లెమాల గ్రూప్, హైపర్ ఆదిని వదిలిపెట్టేందుకు ససేమిరా అంటోందట. కాంట్రాక్టు ప్రకారం హైపర్ ఆది తమతోనే పనిచేయాలని గట్టిగా చెపుతోందట. దీనితో నాగబాబు గారు ఇలా చేశారేమిటి అంటూ తన సన్నిహితుల వద్ద గొణుగుతున్నాడట.
దీనిపై మరింత చదవండి :