గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 నవంబరు 2019 (14:51 IST)

హైపర్ ఆది, అనసూయలపై అఫైర్ అంటగడుతున్నారా? (video)

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా యాంకర్లు అనసూయ, రష్మీ గౌతమ్‌లు బాగా పాపలరైన సంగతి తెలిసిందే. రష్మీ, సుధీర్ మధ్య బంధం గురించి వార్తలు కామన్ కావడంతో.. హైపర్ ఆది, అనసూయ భరద్వాజ్ మధ్య అఫైర్‌ను అంటగడుతున్నట్లు తెలుస్తోంది. రష్మీ గౌతమ్-సుడిగాలి సుధీర్, హైపర్ ఆది - అనసూయల మధ్య ఏదో అఫైర్ వుందంటూ.. షో రేటింగ్ పెంచుకునేందుకు ఈ పనులు చేస్తున్నారని టాక్ వస్తోంది. 
 
నిజానికి, షో రేటింగ్ పెంచుకోవడానికి నిర్వాహకులే వీరి మధ్య ఏదో ఉందనేలా సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకా తమ మధ్య అఫైర్ ఉందని ఆది, అనసూయలే హైప్ చేసుకుంటున్నట్లుగా కొన్ని సన్నివేశాలున్నాయి. ఇంకా అఫైర్ వున్నట్లు తమకు తామే సెటైర్లు, పంచ్‌లు వేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు వీరిద్దరు. తాజాగా.. వీరు జబర్దస్త్ షో వేదికగా చేసిన ఓ సన్నివేశం వీరి మధ్య ఏదో ఉందని తెలిసేలా ఉంది. యూట్యూబ్, సోషల్ మీడియాల్లో వస్తున్న వార్తలకు ఆజ్యం పోసేలా వీరిద్దరు జబర్దస్త్ వేదికపై బైక్‌పై షికార్లు చేశారు.
 
జబర్దస్త్ నిర్వాహకులు విడుదల చేసిన తాజా ప్రోమోలో.. అనసూయ బైక్ నడుపుతుంటే.. హైపర్ ఆది వెనక కూర్చొని, రైడింగ్‌కు బయలు దేరారు. అంతేకాదు.. ఫ్లైట్‌లో కూడా వెళ్దాం అంటూ అనసూయ అనడం.. దానికి హైపర్ ఆది పంచ్ వేయడంతో సన్నివేశం పండింది. కాగా.. నిజ జీవితంలో అనసూయకు పెళ్లైంది. పిల్లలు కూడా ఉన్నారు. అయితే.. షో కోసం హైపర్ ఆదితో అఫైర్ ఉన్నట్లు యాక్ట్ చేయడమే అభిమానులను నిరాశకు గురిచేస్తోందని నెట్టింట్లో జోరుగా కామెంట్లు వస్తున్నాయి.