నాగ‌బాబు బ‌ర్త్ డే సంద‌ర్భంగా వ‌రుణ్ తేజ్ ఏమ‌న్నాడో తెలుసా..?

Varun
శ్రీ| Last Modified బుధవారం, 30 అక్టోబరు 2019 (16:47 IST)
నటుడిగా మంచి పేరు సంపాదించి, అలానే నిర్మాతగా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పైన పలు విజయవంతమైన సినిమాలు నిర్మించిన మెగా బ్రదర్ నాగబాబు తన 58వ జన్మదినాన్ని కుటుంబసభ్యుల మధ్య ఎంతో వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు వరుణ్ తేజ్, తనతో కలిసి దిగిన ఒక పిక్‌ని సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేసారు.

‘హ్యాపీ బర్త్ డే నాన్న, మీ ముఖంపై చిరునవ్వు చిందించడం కోసం ఏమి చేయడానికైనా నేను సిద్ధం, నాకు ఈ జీవితాన్ని ఇచ్చినందకు మీకు కృతజ్ఞతలు, మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూ ఉంటాను’ అంటూ వరుణ్ తన పోస్ట్‌లో తెల్పడం జరిగింది. ఇక ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఒక సినిమాలో వరుణ్ హీరోగా నటిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :