శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (20:30 IST)

డేటింగ్ పూజాతో.. పెళ్ళి సాయపల్లవితో అంటున్న యువ హీరో

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో హాట్ టాపిక్. గద్దల కొండ గణేష్ సినిమాతో ప్రస్తుతం వరుణ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అద్భుతమైన పర్మామెన్స్‌తో వరుణ్ అదరగొట్టాడంటున్నారు అభిమానులు. సినిమా విజయోత్సవంలో మునిగితేలుతున్న వరుణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
వరుణ్ తేజ్ సినిమాల్లో బాగా బిజీగా ఉన్నాడు. ఈ యేడాదే పెళ్ళి చేసుకునే అవకాశం ఉందన్న ప్రచారం బాగానే జరుగుతోంది. ఇది నిజమా అని అడిగితే ఠక్కున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వరుణ్. నేను పెళ్ళి చేసుకుంటే సాయిపల్లవినే.. ఇక డేటింగ్ అంటారా పూజా హెగ్డేతోనే అంటూ తడుముకోకుండా సమాధానం ఇచ్చాడు.
 
పూజాతో కలిసి రెండు సినిమాల్లో నటించాడు వరుణ్. ఒకటి ముకుంద, ఆ తరువాత ప్రస్తుతం గద్దలకొండ గణేష్. ఈ రెండు సినిమాలకే వరుణ్ పూజాతో రొమాంటిక్ టచ్‌కు కనెక్ట్ అయిపోయాడు. అందుకే డేటింగ్ అంటే ఒక్క పూజాతోనే చేస్తానంటున్నాడు. ఫిదా సినిమాతో సాయిపల్లవితో ప్రేమను పెంచేసుకున్నాడు ఈ ఆరడుగుల యువ హీరో. పెళ్ళంటే చేసుకుంటే ఆమెనే చేసుకుంటానంటూ చెబుతున్నాడు. ఐతే... సినిమా హీరోలను ఇలాంటి ప్రశ్నలు వేస్తే అలాంటి సమాధానాలే వస్తాయి మరి.