మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 16 మే 2020 (20:05 IST)

హరీష్ శంకర్ - బండ్ల గణేష్ మధ్య గొడవలా? అసలు ఏమైంది?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ -టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించారు. పవన్ - శృతిహాసన్ జంటగా నటించిన గబ్బర్ సింగ్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 
 
ఈ సందర్భంగా హరీష్ శంకర్.... సోషల్ మీడియాలో స్పందిస్తూ.... ఈ సినిమాలో వర్క్ చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పాడు కానీ.. నిర్మాత బండ్ల గణేష్ గురించి మాత్రం ప్రస్తావించలేదు. దీంతో హరీష్‌ శంకర్‌కి, బండ్ల గణేష్‌కి మధ్య గొడవలు ఉన్నాయని.. అందుకే హరీష్ శంకర్ బండ్ల గణేష్ గురించి చెప్పలేదంటూ వార్తలు వస్తున్నాయి.
 
ఇదే విషయం గురించి నిర్మాత బండ్ల గణేష్‌ని అడిగితే... అది ఆయన సంస్కారం. అంతకన్నా ఏం చెప్పను అంటూ హరీష్ శంకర్ పైన సెటైర్ వేసారు. అంతటి ఆగలేదు... ఆయన రీమేక్‌లు మాత్రమే చేయగలరు. స్ట్రయిట్ సినిమా తీసి హిట్ చేసి చూపించమనండి.. ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతా అంటూ సవాల్ విసిరాడు. హరీష్ శంకర్ అనే డైరక్టర్‌కు పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కల్పించింది నేను. ఆయన సినిమాలు లేక కిందా మీదా అవుతుంటే పరిచయం కల్పించింది తనే అని చెప్పారు.
 
ఎన్టీఆర్ సినిమా ఇస్తానన్న నల్లమలపు బుజ్జి ఆ సినిమా ఇవ్వకపోవడంతో డిప్రెషన్లో వుంటే పిలిచి అవకాశం వచ్చేలా చేసాను. పవన్ కళ్యాణ్‌ ఫామ్ హవుస్‌లో ఉంటే తీసుకెళ్లి మిరపకాయ్ కథ వినిపించాను అని చెప్పాడు 
 
బండ్ల గణేష్. రీమేక్ తప్ప.. స్ట్రైయిట్ మూవీతో సక్సెస్ సాధించలేడు అని హరీష్ శంకర్ గురించి కామెంట్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. మరి.. బండ్ల గణేష్ కామెంట్స్ పైన హరీష్ శంకర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.