మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 15 మే 2020 (23:07 IST)

పవన్ డైరెక్టర్స్ ఇద్దరూ కలుస్తున్నారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో డైరెక్టర్ క్రిష్ ఓ భారీ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. చారిత్రాత్మక చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్న టైమ్‌లో కరోనా రావడంతో షూటింగ్‌కి బ్రేక్ పడింది. 
 
ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది క్లారిటీ లేదు. ఇక పవన్‌తో మూవీ చేయనున్న మరో డైరెక్టర్ హరీష్ శంకర్. పవన్ -హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వడంతో వీరిద్దరి కాంబినేషన్లో రానున్న తాజా సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
 
ఇదిలా ఉంటే... ఇప్పుడు ఈ పవన్ డైరెక్టర్స్ ఇద్దరూ కలుస్తున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. ఇంతకీ విషయం ఏంటంటే... క్రిష్, హరీష్‌ శంకర్ ఇద్దరూ కలిసి వరుసగా వెబ్ సిరీస్‌లు, వెబ్ ఫిల్మ్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. కొన్ని వెబ్ సిరీస్‌లను వీళ్లిద్దరూ కలిసి ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. 
 
ఆల్రెడీ కొన్ని స్టోరీస్ ఫైనల్ చేసినట్టు సమాచారం. అంతే కాకుండా కొన్ని సిరీస్‌లకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసినట్టు టాక్.
 
 ఇందులో కొత్తవాళ్లతో పాటు కొంతమంది యువ హీరోలు కూడా నటించనున్నారని తెలిసింది. మొత్తానికి టాలీవుడ్ వెబ్ సిరీస్ వైపు అడుగులు వేస్తుంది. వీరి బాటలో మరి కొంతమంది ఫిల్మ్ మేకర్స్ నడుస్తారేమో చూడాలి.