శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 15 మే 2020 (22:34 IST)

పవన్ కళ్యాణ్‌ - త్రివిక్రమ్ మూవీ ఉందా? లేదా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చేస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్‌.. విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్‌తో కూడా సినిమా చేస్తున్నారు. అయితే.. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇవ్వనున్నారు అని తెలిసినప్పటి నుంచి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో పవన్ సినిమా ఉంటుంది అనుకున్నారు. 
 
ఎందుకంటే.. పవన్ - త్రివిక్రమ్ మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అసలు పవన్ రీఎంట్రీ మూవీనే త్రివిక్రమ్ డైరెక్షన్లో ఉంటుంది అనుకున్నారు కానీ.. అలా జరగలేదు. తాజా వార్త ఏంటంటే... త్రివిక్రమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయనున్నారు. అఫిషియల్‌గా ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసారు కానీ.. కరోనా కారణంగా ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. 
 
అందుచేత పవన్ కళ్యాణ్‌ తో త్రివిక్రమ్ సినిమా ఎప్పుడైనా ఉండచ్చు అంటూ వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్.. ఓకే అనేలా కానీ.. సినిమా చేయడానికి పవర్ స్టార్ రెడీ అని టాలీవుడ్లో టాక్. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే.. పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ ఉండచ్చు అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదే కనుక జరిగితే.. పవర్ స్టార్ అభిమానులకు పండగే.